CBI | వామనరావు దంపతుల హత్య.. కేసు నమోదుచేసిన సీబీఐ
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో దర్యాప్తు బాధ్యతలను సీబీఐ (CBI) చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసింది.
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో దర్యాప్తు బాధ్యతలను సీబీఐ (CBI) చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసింది. నిందితులుగా వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ పేర్లను చేర్చింది. 2021, ఫిబ్రవరి 17న పెద్దపల్లి సమీపంలో వామనరావు దంపతులు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు సుప్రీం కోర్టులో పిషన్ దాఖలు చేశారు. గత నెల 12న పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసు నమోదుచేసింది.
‘ఈ హత్య కేసులో కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామగిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. అయితే ఈ కేసు దర్యాప్తును చేపట్టి తుది నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 12న ఆదేశించింది. దీంతో ఇప్పటికే రామగిరి పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ను అదే సెక్షన్ల కింద మంథని మండలం గుంజపడుగుకు చెందిన వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్లపై రీరిజష్టర్ చేసి విచారణ చేపడుతున్నాం’ అని సీబీఐ పేర్కొంది. కేసు దర్యాప్తు అధికారిగా ఇన్స్పెక్టర్ విపిన్ గహలోత్ వ్యవహరించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

