జూరిచ్: స్విట్జర్లాండ్‌కు చెందిన ఆహార ఉత్పత్తుల కంపెనీ నెస్లే సీఈవో(Nestle CEO) లారెంట్ ఫ్రెక్సీపై వేటు వేశారు. సహచర ఉద్యోగినితో రొమాంటిక్ రిలేషన్ కొనసాగించిన నేపథ్యంలో కంపెనీ ఆ చర్యలు తీసుకున్నది. నెస్‌ప్రెసో సీఈవో ఫిలిప్ నవ్రాతిల్కు అతని స్థానంలో బాధ్యతలు అప్పగించారు. నెస్లే వ్యాపార ప్రవర్తనా నియమావళిని లారెంట్ ఉల్లంఘించినట్లు కంపెనీ తన స్టేట్మెంట్లో తెలిపింది. సబార్డినేట్‌తో రొమాంటిక్ కొనసాగించిన అంశంలో విచారణ చేపట్టనున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. చైర్మెన్ పౌల్ బల్కే నేతృత్వంలో దర్యాప్తు జరగనున్నది. ఇది చాలా అవసరమైన నిర్ణయమని, నెస్లే కంపెనీ విలువలు ఆ కంపెనీకి చాలా బలమైన పునాది అన్నారు. ఇన్నాళ్లూ సేవ చేసినందుకు లారెంట్‌కు థ్యాంక్స్ చెబుతున్నట్లు బల్కే తన స్టేట్మెంట్లో చెప్పారు. 1986లో నెస్లే కంపెనీలో ఫ్రెక్సీ చేరారు. 2014 వరకు యురోపియన్ ఆపరేషన్స్‌ను ఆయన చూసుకున్నారు. సీఈవోగా ప్రమోషన్ రాకముందు ఆయన లాటిన్ అమెరికా డివిజన్‌కు అధిపతిగా చేశారు.