కట్టంగూర్, ఏప్రిల్ 07 : కట్టంగూర్ మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో టెన్త్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో పున్నంరాజు సుధాకర్- సౌమ్య దంపతుల సహకారంతో 250 మజ్జిగ ప్యాకెట్లను మంగళవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు చిక్కు శేఖర్ మాట్లాడుతూ.. వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కో ఆర్డినేటర్ రెడ్డిపల్లి సాగర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, ట్రెజరర్ పోగుల రాములు, సహాయ కార్యదర్శి బసవోజు వినోద్ కుమార్, గోషిక ఉమాపతి, మంగదుడ్ల శ్రీనివాసు, బొడ్డుపల్లి వెంకన్న, మన్నెం అంజయ్య పాల్గొన్నారు.