Justice Nagarathna: నెలలో 3 రోజులు అస్పృశ్యులం కాలేం.. శబరిమల కేసులో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలు
Justice Nagarathna: ఓ మహిళగా ఆలోచిస్తే, నెలలో 3 రోజులు అంటరానివాళ్లం కాలేమని, ఆ తర్వాత 4వ రోజు అస్పృశ్యత లేదని చెప్పలేమని జస్టిస్ నాగరత్న అన్నారు. శబరిమల కేసులో ఆర్టికల్ 17 ప్రస్తావన చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇవాళ సుప్రీం ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది.
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. 9 మంది సభ్యుల ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. అయితే విచారణ సమయంలో జస్టిస్ బీవీ నాగరత్న(Justice Nagarathna) కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఆర్టికల్ 17ని ప్రస్తావించడాన్ని ఆమె వ్యతిరేకించారు. ఓ మహిళగా ఆలోచిస్తే, నెలలో మూడు రోజులు మహిళలను అంటరానివారిగా చూడలేమని, నాలుగో రోజు అస్పృశ్యత లేదని చెప్పడం సరికాదన్నారు. ఆర్టికల్ 17 కేవలం ఆ మూడు రోజులకే ఎలా వర్తిస్తుందని ఆమె ప్రశ్నించారు. రుతుక్రమ వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లకూడదన్న నిబంధనపై విచారణ జరుగుతున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం తరపున వాదనలు వినిపిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా 2018 నాటి శబరిమల తీర్పును ప్రస్తావించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఆలయ ప్రవేశాన్ని కల్పించకపోవడం ఒకరమైన అంటరానితనమే అవుతుందని ఆ తీర్పులో చెప్పారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 17ను ఉల్లంఘించినట్లే అవుతుందని అప్పటి సీజే చంద్రచూడ్ అన్నారన్నారు. అయితే తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలను జస్టిస్ నాగరత్న తప్పుపడుతూ.. శబరిమల కేసులో ఆర్టికల్ 17 అప్లై అవుతుందంటే అప్పుడు మహిళలను అంటరానివారిగా పరిగణిస్తున్నట్లు అర్థం వస్తుందని, దీని పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
శబరిమల కేసు వాదిస్తున్న ధర్మాసనంలో.. జస్టిస్ నాగరత్న ఒక్కరే మహిళా న్యాయమూర్తి కావడం గమనార్హం. శబరిమల కేసులో ఎలా ఆర్టికల్ 17 గురించి వాదించారో అర్థం కావడం లేదని, ఓ మహిళగా ఆలోచిస్తే, ప్రతి నెల మూడు రోజుల పాటు అస్పృశ్యత ఉండదని, ఇక నాలుగో రోజు అంటరానివాళ్లం కాదన్న భావన సరైంది కాదన్నారు. అయితే తానేమీ రుతుక్రమ సమస్య గురించి మాట్లాడడం లేదని తుషార్ మెహతా క్లారిటీ ఇవ్వబోయారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అనేది రుతుక్రమ సమస్యకు సంబంధించినది కాదు అని, కేవలం వయసు సంబంధిత అంశమే అని మెహతా అన్నారు. తన వాదన తనకు మాత్రమే అని, ఇది 4 రోజులకు సంబంధించినది కాదు అని, ఇది ఆ వయసు గ్రూపుకు సంబంధించినదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

