Air India | చమురు సంక్షోభం.. విమాన టిక్కెట్ల ఛార్జీలు పెంచనున్న ఎయిరిండియా.. రేపటినుంచే అమలు
Air India : చమురు సంక్షోభం ప్రభావం దేశీయ విమానయాన సంస్థలపై పడుతోంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు పెరుగుతుండటంతో టిక్కెట్ల ఛార్జీలు పెంచాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది.
Air India : చమురు సంక్షోభం ప్రభావం దేశీయ విమానయాన సంస్థలపై పడుతోంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు పెరుగుతుండటంతో టిక్కెట్ల ఛార్జీలు పెంచాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఏప్రిల్ 8, బుధవారం నుంచే టిక్కెట్ల ఛార్జీల పెంపు నిర్ణయం అమలులోకి రానుంది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌తోపాటు, ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ టిక్కెట్ల ఛార్జీలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతానికి కొన్ని ఇంటర్నేషనల్ రూట్లలో మాత్రం ఛార్జీల పెంపు ఉండబోతుంది.
ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. హార్ముజ్ జలసంధి మూసివేయడం, ఇరాన్ సహా గల్ఫ్ దేశాల్లో చమురు కేంద్రాలపై దాడులు జరగడం కారణంగా చమురు లభ్యత తగ్గి, ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన టిక్కెట్లపై విధించే ఫ్యూయల్ ఛార్జీలు కనిష్టంగా రూ.299 నుంచి గరిష్టంగా రూ.899కి పెంచాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ప్రస్తుతం యుద్ధం కారణంగా ముడి చమురు ధర భారీగా పెరిగింది. విమాన ఇంధన ధరలు కూడా రెట్టింపయ్యాయి. బ్యారెల్ విమాన ఇంధన ధర ఫిబ్రవరిలో 99.40 డాలర్లు ఉండగా, గతవారం 195.19 డాలర్లు ఉంది. ఎయిర్ ఇండియా తాజా నిర్ణయం ప్రకారం నేరుగా టిక్కెట్ల ధరలు కాకుండా ఇంధన సర్ ఛార్జీలు మాత్రమే పెరుగుతాయి. గతంలో ఈ విషయంలో ఫ్లాట్ ఛార్జీలు విధించేవారు. ఇప్పుడు దూరాన్ని బట్టి ఛార్జ్ చేస్తున్నారు.
500 కిలోమీటర్లలోపు దూరానికి అదనంగా రూ.299, 501-1000 కిలోమీటర్లలోపు దూరానికి రూ.399, 1,001-1,500 కిలోమీటర్లలోపు దూరానికి రూ.549, 1,501-2,000 కిలోమీటర్లలోపు దూరానికి రూ.749, 2,000 కిలోమీటర్లకు మించిన దూరానికి రూ.899 అదనంగా చెల్లించాలి. ఏప్రిల్ 8, ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ ఛార్జీలు అమలవుతాయి. ఇందులో పర్ సెక్టార్, పర్ ప్యాసింజర్ అనే రెండు విభాగాలుంటాయి. అంటే ఒక చోటు నుంచి మరో చోటుకు నేరుగా వెళ్తే ఒక సెక్టార్ కింద పరిగణిస్తారు. అదే ఒక ప్రయాణికుడు కనెక్ట్ ఫ్లైట్ ద్వారా రెండు వేర్వేరు విమానాల్లో వెళ్తే రెండు సెక్టార్ల కింద దానికి రెండు ఫ్యుయల్ ఛార్జీలు అమలవుతాయి. దీని ద్వారా డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే తక్కువ ఛార్జీ పడుతుంది. అదే కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే, అదనంగా మరికొంత చెల్లించాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

