Collector Pratima Singh | ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు : కలెక్టర్ ప్రతిమా సింగ్
Collector Pratima Singh | ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో సమతుల ఆహారం తీసుకోవడం, నియమిత వ్యాయామం చేయడం, పరిశుభ్రత పాటించడం వంటి అలవాట్లను తప్పనిసరిగా అలవరచుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
Collector Pratima Singh | మెదక్ రూరల్, ఏప్రిల్ 07: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హవేలీ ఘనాపూర్ మండలంలోని సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. పలు ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. “Together for Health – Stand With Science” అనే థీమ్‌ను ప్రస్తావిస్తూ, ప్రజలు శాస్త్రీయ దృక్పథంతో ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఆరోగ్యం అనేది కేవలం వ్యాధుల లేమి మాత్రమే కాకుండా శారీరక, మానసిక, సామాజిక సంక్షేమం కలగలిపిన సమగ్ర స్థితి అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో సమతుల ఆహారం తీసుకోవడం, నియమిత వ్యాయామం చేయడం, పరిశుభ్రత పాటించడం వంటి అలవాట్లను తప్పనిసరిగా అలవరచుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించి, మిల్లెట్ ఆహారం, పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటి పద్ధతులను అనుసరించాలని తెలిపారు.
సీజనల్ వ్యాధులు, జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతీ కుటుంబం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సింధు రేణుక ఎంపీవో కృష్ణవేణి, డా. వినయ్ సుశీల్, సర్పంచ్ , అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Read Also :
Reservoirs | తెలంగాణలో తీవ్ర నీటి సంక్షోభం.. డెడ్ స్టోరేజ్ దిశగా తెలంగాణ జలాశయాలు
Anant Ambani | ఆధ్యాత్మిక సేవలో అంబానీ వారసుడు.. గురువాయూర్, రాజరాజేశ్వరం ఆలయాలకు రూ.18 కోట్ల సాయం!
New Shayampet | కాలుష్య కోరల్లో చెరవులు..పట్టించుకోని అధికారులు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

