Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ఈసారి అధికారంలోకి వస్తే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని రాహుల్ గాంధీ తరచూ చెప్తున్నారు. అయితే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్నదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యానిపెస్టోలోని హామీలను అమలు చేయాలంటే ఖజానాపై ఏటా రూ. 23 లక్షల కోట్లకు పైగా భారం పడుతుందని, ఇది దేశ బడ్జెట్ మొత్తంలో సగమని గుర్తుచేస్తున్నారు. ఈ మేరకు ‘బిజినెస్ టుడే’తో మాట్లాడారు. కాంగ్రెస్ హామీలతో ఆర్థిక వ్యవస్థపై భారం పడటమే కాదు.. అది పరోక్షంగా ద్రవ్యోల్బణం, ఉత్పాదకతపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు.
