Stock Market : భారత స్టాక్ మార్కెట్ బుధవారం నష్టా్ల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 325 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ వరుసగా ఏడో సెషన్లో కూడా నష్టపోవడం గమనార్హం. సెన్సెక్స్ ఉదయం 77,218.05 పాయింట్ల వద్ద నష్టాల్లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత రోజంతా ట్రేడింగ్ నష్టాల్లోనే కొనసాగింది. సెన్సెక్స్ గరిష్టంగా 77,347.81 పాయింట్లను చేరి, కనిష్టంగా 76,822.89 పాయింట్లకు చేరింది. రోజులో సగటున 524.92 పాయింట్లు నష్టపోయింది.
చివరకు 325.78 పాయింట్ల (0.42 శాతం) నష్టంతో 76,909.68 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 76.60 పాయింట్లు (0.32 శాతం) నష్టపోయి 24,078.30 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇలా నష్టాల బాటలో ముగియడం ఇది వరుసగా ఏడోసారి. మరోవైపు బ్రాడర్ మార్కెట్ కూడా నష్టాల్లోనే ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.59 పాయింట్లు (0.01 శాతం), బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 67.12 పాయింట్లు (0.73 శాతం) నష్టపోయింది. నిఫ్టీ ఐటీ షేర్లు 0.73 శాతం లాభపడగా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.55 శాతం, నిఫ్టీ ఆటో 0.27 శాతం నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
వీటిలో హెచ్‌సీఎల్ టెక్ షేర్లు 1.73 శాతం లాభపడ్డాయి. మరోవైపు పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, బజాజ్ ఫినాన్స్, హిందుస్తాన్ యునీలివర్ షేర్లు నష్టపోయాయి. వీటిలో పవర్ గ్రిడ్ షేర్లు 2 శాతం నష్టాలు చవిచూశాయి. డాలర్‌తో రూపాయి స్వల్పంగా.. 2 పైసలు తగ్గింది. 95.76 వద్ద కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 91 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,368 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.