బీఆర్ఎస్ విద్యార్థి (BRSV) పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పాటను హైదరాబాద్‌లోని నందినగర్‌లో కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్, ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ సతీష్ రెడ్డి, BRSV రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్, BRSY రాష్ట్ర నాయకులు వల్లమల్ల కృష్ణ, BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగు నవీన్ గౌడ్, మిథున్ ప్రసాద్, సంతోష్, సింగర్స్ మద్దెల సందీప్ గౌడ్, మానుకోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.