KTR | రాజన్న సిరిసిల్ల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదలు ముంచెత్తుతుంటే.. మూసీ సుందరీకరణపై సమీక్షనా.. అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ భారీ వర్షాలు, వరదలకు ప్రజలు అవస్థలుప పడుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డేమో నిన్న మూసీ సుందరీకరణ మీద రివ్యూ చేసినట్టు చూశాం. ఇవాళ్నేమో రాష్ట్రానికి ఒలింపిక్ ఎట్ల తేవాలని చర్చిస్తున్నట్టు ఇందాకనే టీవీల్లో చూశాం. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించుకుంటూ కూర్చున్నాడట.. అలా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా..? రాష్ట్రానికి ఒలింపిక్ తేవాలని చర్చ చేయడం ముఖ్యమా..? ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది..? ఆస్తి, ప్రాణ నష్టం ఎంత జరిగింది..? ఎంత మంది విపత్తుల్లో ఉన్నారు..? అని చూడడం ముఖ్యమా అని కేటీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్లను పంపి సామాన్యుల ప్రాణాలను కాపాడడం జరిగింది. ఇవాళ మన రాష్ట్రానికి చెందిన హెలికాప్టర్లు బీహార్ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి. ఇంకా ఎక్కడెక్కడ్నో తిరుగుతున్నయ్ తప్ప సామాన్యులకు అందుబాటులో లేవు. ఖమ్మంలో వరదలు వస్తే పట్టించున్న నాథుడు లేడు. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం జిల్లాకు హెలికాప్టర్‌ను పంపలేదు. చివరకు ఇవాళ నర్మాలలో చిక్కుకున్న ఐదుగురిని ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి కాపాడింది. ఒక వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. కొంత ఆస్తి నష్టం, పంట నష్టం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఉంటే ఇంత నష్టం జరిగి ఉండకపోయేది. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అక్కడ ఎకరానికి రూ. 25 వేలు పరిహారం ఇవ్వాలి. ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. కూలిపోయిన ఇండ్లకు వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో మా నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పర్యటిస్తూ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని కేటీఆర్ పేర్కొన్నారు. వరద బాధితులకు ఆహారం, వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.
సిరిసిల్లలో వరద ప్రాంతాలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, కామారెడ్డి వెళ్లేందుకు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డికి చేరుకున్నారు.
సిరిసిల్ల నర్మాల పర్యటన ముగించుకుని కేటీఆర్ మాచారెడ్డి మండలానికి వచ్చారు.
అక్కడ ఆయన పాల్వంచ వాగు ఉధృతిని, తెగిన రోడ్డును… pic.twitter.com/fYt3CTZwT3
— BRS Party (@BRSparty) August 28, 2025