– పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
ఖమ్మం రూరల్, ఆగస్టు 28 : ఖమ్మం రూరల్ మండల పరిధిలో పొన్నెకల్ పద్దులపల్లి గ్రామాల మధ్యలో గల ఖమ్మం -సూర్యాపేట ప్రధాన రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సూర్యాపేట నుంచి ఖమ్మం వస్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ముందుగా ఆగి ఉన్నటువంటి ఓ లారీ కంటైనర్ను ఢీకొట్టడంతో బస్సులోని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కాలు విరిగినట్లుగా సమాచారం. గాయపడిన ప్రయాణికులను స్థానికుల సహాయంతో పోలీస్ అధికారులు ఖమ్మం ప్రధాన వైద్యశాలకు తరలించారు.