Dubai Princess | ‘ఇన్స్టాగ్రామ్’ ద్వారా భర్తకు విడాకులు పంపి సంచలనం సృష్టించిన దుబాయ్ యువరాణి (Dubai Princess) షేక్ మెహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తోమ్ (Sheikha Mahra Mohammed Rashed Al Maktoum) రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ప్రముఖ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానా (French Montana)ను వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు వీరికి తాజాగా ఎంగేజ్మెంట్ (Engaged) కూడా జరిగింది. ఈ విషయాన్ని ర్యాపర్ అధికార ప్రతినిధి తాజాగా వెల్లడించారు.
కాగా, భర్తతో విడాకుల ప్రకటన చేసిన కొన్ని రోజులకే ర్యాపర్‌తో మెహ్రా దుబాయ్ వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. మొరాకాలో రెస్టారెంట్లు, మసీదులను సందర్శిస్తూ మీడియా కంట పడ్డారు. అప్పటి నుంచే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం మొదలైంది. భర్తకు విడాకులు ఇవ్వడానికి ఇది కూడా కారణమని వదంతులు వచ్చాయి. ఇక ఈ ఏడాది జూన్‌లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో వీరిద్దరూ జంటగా కన్పించడం డేటింగ్ రూమర్స్‌కు బలం చేకూర్చింది. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చారు.
షేక్ మెహ్రా.. దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. 2023 మేలో దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. గతేడాది ఈ జంటకు ఓ పాప కూడా జన్మించింది. ఆ తర్వాత కొన్ని నెలలకే భర్తకు విడాకులిస్తున్నట్లు షేక్ మెహ్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్నాడంటూ గతేడాది జూలైలో ఇన్స్టాద్వారా ఆమె విడాకులు పంపింది. “డియర్ హజ్బండ్.. మీరు ఇతరుల సహచర్యాన్ని కోరుకోవడంతో నేను విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నా. నేను మీకు విడాకులు ఇస్తున్నా.. నేను మీకు విడాకులు ఇస్తున్నా.. నేను మీకు విడాకులు ఇస్తున్నా. టేక్ కేర్. మీ మాజీ భార్య” అని షేక్ మెహ్రా తలాక్ చెబుతూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఆ వెంటనే ఈ వార్త వైరల్ అయింది. దుబాయ్ పాలకుడి కూతురు ఇలా సోషల్ మీడియా వేదికగా భర్తకు విడాకులు ఇవ్వడం అప్పట్లో సంచలనం రేపింది.
Also Read..
PM Modi | చైనా పర్యటనకు ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం
US-India | ఇది మోదీ యుద్ధం.. భారత్ అలా చేస్తే రేపటి నుంచే 25 శాతం సుంకాలు : అమెరికా