బంజారాహిల్స్,అక్టోబర్ 12: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశాన్ని రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్ మైదానంలో సోమవారం నిర్వహించనున్నారు. సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆదివారం పరిశీలించారు. సుమారు 4 వేలమంది బూత్ కమిటీ సభ్యులతో పాటు నియోజకవర్గంలోని కీలకనాయకులంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, పద్మారావుగౌడ్‌తో పాటు పార్టీకి చెందిన పెద్దలంతా సమావేశంలో పాల్గొని రానున్న ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచార వ్యూహాలపై దిశా నిర్దేశం చేస్తారన్నారు.బూత్ కమిటీల సభ్యులంతా ఉదయం 10 గంటలకు సభాస్థలికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ నేతలు అరుణ్‌కుమార్, నాగరాజు, కేఎన్ రెడ్డి, లియాకత్ అలీ, అరాఫత్, ధనూజ, కుమార్, షేక్ అబ్దుల్ ఘనీతో పాటు అన్ని బూత్‌ల ఇన్చార్జిలు పాల్గొన్నారు.