మాగనూర్/కృష్ణ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS ) అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడంతోపాటు పల్లె ఫలితం నుంచి కాంగ్రెస్ పతనానికి నాంది పలికేలా కార్యకర్తలు పనిచేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy) పిలుపునిచ్చారు. బుధవారం మాగనూర్, కృష్ణ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎల్లారెడ్డి, శివరాజ్ పాటిల్ అధ్యక్షతన గుడెబల్లూర్ గ్రామ శివారులో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ప్రభుత్వం పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తూ, నిరుపేదలను విస్మరిస్తున్నారని పలువురు కార్యకర్తలు వెల్లడించారు. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అందించకుండా కాంగ్రెస్ నాయకులు అరాచకమైన పరిపాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమన్వయంతో ఉండి కాంగ్రెస్ బ్రతుకు బండారాన్ని బయటపెట్టే వారమవుతామని కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కృష్ణా నదికి వరద వచ్చి నెలన్నర గడిచినప్పటికీ నియోజకవర్గంలో ఉన్న భూత్పూర్, సంఘం బండ రిజర్వాయర్లను వరద నీటితో నింపకుండ మంత్రి వాకిటి శ్రీహరి నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. మంత్రికి సాగునీటి ప్రాజెక్టులపై అనుభవం లేదని ఆరోపించారు.
ఈ సమావేశంలో రైతు సమన్వయ సభ్యురాలు సుచరిత రెడ్డి, రాజుల అసిరెడ్డి, మక్తల్ మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహారెడ్డి, రాజేష్ గౌడ్, బీఆర్ఎస్ మాగనూరు మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి , ఉమ్మడి మండల పీఏసీఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకులు శివరాజ్ పాటిల్,శివప్పా, మహదేవ్, అశోక్ గౌడ్, శంకర్ నాయక్, మోనేష్, అబ్దుల్ ఖాదర్, భీమ్, రవి, క్షిరలింగప్ప, తిప్పయ్య, మారెప్ప, పల్లె మారెప్ప, అశోక్ గౌడ్, రాఘవేంద్ర, రాఘవేంద్ర గౌడ్, అమ్రేష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.