BRS Party | హుజురాబాద్ రూరల్, జూన్ 01 : హుజురాబాద్ పట్టణంలోని బాలుర హైస్కూల్ మినీ స్టేడియాన్ని అడ్డుకున్నందుకే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు వాకింగ్ ట్రాక్ కుట్ర పన్నాడని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రేస్ ప్రభుత్వం రూ.10 కోట్లు ఎగవేసేందుకే రూ.10 లక్షల వాకింగ్ ట్రాక్ కుట్ర చేస్తున్నారని.. హుజురాబాద్‌కు మినీ స్టేడియం రాకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా, విప్‌గా పని చేసిన ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని క్రీడాకారుల భవిషత్తును ప్రజల ఆరోగ్యాలను దృష్టిలోపెట్టుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో పట్టణంలోని హైస్కూల్ మైదానంలో మినీ స్టేడియానికి రూపకల్పన చేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి రూ.10 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని.. కానీ ఈ ప్రాంత అభివృద్ధి ఇష్టం లేని కాంగ్రేస్ నాయకులు ఇప్పుడు 10 లక్షలతో వాకర్స్ ట్రాక్ ఏర్పాటు చేసి మినీ స్టేడియం ఏర్పాటును అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ ప్రాంత క్రీడాకారులు, ప్రజలు స్టేడియం నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ బాబు తనను తిరస్కరించిన ఈ ప్రాంత ప్రజలపై కక్ష తీర్చుకొనేందుకు అభివృద్ధి ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. అధికార పార్టీలో ఉండి హుజురాబాద్ కాంగెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు చేతనైతే మినీ స్టేడియానికి మంజూరైన 10 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుండి విడుదల చేయించి స్టేడియాన్ని నిర్మించేందుకు కృషి చేయాలి గానీ డిమాండ్ చేశారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!