BRS MLAs | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఇదే పీఎస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కూడా ప్రత్యేకంగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. స్పీకర్‌పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు ప్రతిగా ఆయన్ను అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు పోలీసులను ప్రోత్సహించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధును ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతున్నది.
అయితే, తమ విధులకు ఆటంకం కలిగించారని, అలాగే దాడులు చేశారనే అభియోగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, సుధీర్‌రెడ్డితో పాటు పలువురిని ఈ కేసులో ఇరికించినట్టు తెలిసింది. పోలీసులపై దాడులు చేశారని, వారిని దుర్భాషలాడార నే కోణంలోనే కేసు నమోదు చేసినట్టు సమాచారం. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా అదుపులోకి తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై పోలీసు ఉన్నతాధికారులు సైతం న్యా య నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. సోమవారం అర్ధరాత్రి వరకూ అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. వారి ఒక్కరిపైనే కేసు కడితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే బీజేపీ కార్యకర్త గణేశ్, ఆప్ కార్యకర్త హేమచంద్రపై కూడా కేసులు పెట్టినట్టు తెలిసింది.