BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసు.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎఫ్ఐఆర్!
BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఇదే పీఎస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కూడా ప్రత్యేకంగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం.
BRS MLAs | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, ఇదే పీఎస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కూడా ప్రత్యేకంగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. స్పీకర్‌పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు ప్రతిగా ఆయన్ను అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు పోలీసులను ప్రోత్సహించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధును ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతున్నది.
అయితే, తమ విధులకు ఆటంకం కలిగించారని, అలాగే దాడులు చేశారనే అభియోగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, సుధీర్‌రెడ్డితో పాటు పలువురిని ఈ కేసులో ఇరికించినట్టు తెలిసింది. పోలీసులపై దాడులు చేశారని, వారిని దుర్భాషలాడార నే కోణంలోనే కేసు నమోదు చేసినట్టు సమాచారం. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా అదుపులోకి తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై పోలీసు ఉన్నతాధికారులు సైతం న్యా య నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. సోమవారం అర్ధరాత్రి వరకూ అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. వారి ఒక్కరిపైనే కేసు కడితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే బీజేపీ కార్యకర్త గణేశ్, ఆప్ కార్యకర్త హేమచంద్రపై కూడా కేసులు పెట్టినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS MLAs
- harish rao
- KTR
- Tatha Madhu
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

