పెద్దపల్లి కమాన్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో, అక్కడికి వెళ్లకుండా పెద్దపల్లి ( Peddapalli ) లో బీఆర్ఎస్ నాయకులను ( BRS Leaders ) పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియ జేసేందుకు వెళ్తున్న నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో మోబిన్, పెంచాల శ్రీధర్, వెన్నం రవీందర్, రెవెల్లి స్వామి, బేక్కం ప్రశాంత్, దిలీప్ కాట్రి తదితరులు ఉన్నారు.