INDA vs SLA : ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా నిలిచిన భారత- ఏ జట్టు అనధికారికి టెస్టు సిరీస్‌నూ కొల్లగొట్టింది. శ్రీలంక- ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఓపెనర్ సాయి సుదర్శన్(168) భారీ శతకంతో చెలరేగగా.. గుర్నూర్ బ్రార్(4-77, 6-68) పది వికెట్లతో రెచ్చిపోయాడు. లోయరార్డర్ కూడా రాణించగా నాలుగో రోజు ఇండియా ఏ అదిరే విక్టరీ కొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో 541 రన్స్ చేసిన భారత్ నాలుగో రోజు విజేతగా ప్రకటించారు. దాంతో, ఆతిథ్య జట్టు మరో ట్రోఫీని కోల్పోయింది.
శ్రీలంక పర్యటనలో జోరు చూపించిన భారత ఏ జట్టు అనధికారిక టెస్టు సిరీస్‌నూ పట్టేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్(168) వరసగా రెండో శతకంతో కదం తొక్కగా గుర్నూర్ బ్రార్(4-77, 6-68) వికెట్ల వేటతో లంక ఏ టీమ్‌ను భయపెట్టాడు. ఓవర్‌నైట్ స్కోర్ 541/8తో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మరో రెండు పరుగులకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం ఆట మొదలెట్టిన లంకను గుర్నూర్ ఆదిలోనే దెబ్బకొట్టాడు.
India-A won the 2nd unofficial Test by 10 wickets and clinched the two-match Test series against SL-A with a margin of 1️⃣-0️⃣ 🇮🇳🏏#SLvIND #DhruvJurel #SaiSudharsan #DevduttPadikkal #CricketTwitter pic.twitter.com/QrO8iQ3s55
— InsideSport (@InsideSportIND) July 5, 2026
గుర్నూర్ విజృంభణతో టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ సోహన్ డె లివెరా(2)ను వెనక్కి పంపిన బ్రార్.. నువనిందు ఫెర్నాండో(5), అషెన్ బండార(5)లను పెవిలియన్ చేర్చి లంకను చావుదెబ్బ తీశాడు. సరాన్ష్ జైన్ రెండు వికెట్లతో రాణించగా 209 పరుగులకే ఆతిథ్య జట్టు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 39 రన్స్ చేసిన ఇండియా ఏ 10 వికటెల విజయంతో ట్రోఫీని అందుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఏ బ్యాటర్లను భారత ఏ బౌలర్లు గొప్పగా కట్టి చేశారు. కెప్టెన్ సహన్ అరాచ్చిగా(127) శతకం బాదినా.. మిగతా బ్యాటర్లను క్రీజులో నిలవనీయలేదు. గుర్నూర్ బ్రార్(4-77), సరాన్ష్ జైన్ నాలుగేసి వికెట్లు తీయగా.. ఆతిథ్య లంక 366 పరుగులకే ఆలౌటైంది. భారత ఏ బౌలర్లలో యశ్ ఠాకూర్ రెండు వికెట్లతో రాణించాడు.
Gurnoor Brar starred with a six-wicket haul as India A clinched a commanding 10-wicket win over Sri Lanka A in the second Unofficial Test 👏🔥
Is it time to give him a chance in India’s Test squad? 🤔 pic.twitter.com/cOHJisUt5P
— Cricbuzz (@cricbuzz) July 5, 2026