ముంబై: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం మరో మరణం నమోదైంది. చెట్టు కూలడంతో ఒక వ్యక్తి చనిపోయాడు. (Mumbai rains claim another life) ముంబైలోని కుర్లా వెస్ట్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 12:40 గంటల సమయంలో వర్షాలు, గాలులకు నౌపాడాలో ఒక చెట్టు కూలింది. 63 ఏళ్ల యూనస్‌పై ఆ చెట్టు పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. చెట్టు కొమ్మల కింద చిక్కుకున్న ఆయనను బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యూనస్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాగా, యూనస్ ఇటీవల ఆ ప్రాంతంలో ఒక షాపు కొనుగోలు చేశాడు. దానిని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం ఆ షాపు వద్దకు వచ్చి పరిశీలిస్తున్న ఆయనపై చెట్టు కూలడంతో మరణించాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ముంబైలో భారీ వర్షాలకు ఇప్పటి వరకు నలుగురు మరణించారు. అలాగే బలమైన గాలులకు పలు చెట్లు విరిగాయి. బాంద్రా ఈస్ట్‌లో బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా మరో చెట్టు కూలింది. దీంతో అక్కడ పార్క్ చేసిన పలు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బీఎంసీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కూలిన చెట్టు కొమ్మలు నరికి తొలగించే చర్యలు చేపట్టారు.
VIDEO | A 63-year-old man was killed after a tree collapsed on a shop during heavy rainfall in Mumbai’s Kurla area, making it the city’s second fatal tree-fall incident in less than a week, civic officials said.
The incident occurred around 12.40 pm near the Hindi BMC School in… pic.twitter.com/Wy6s8L4eZr
— Press Trust of India (@PTI_News) July 5, 2026
#WATCH | Mumbai, Maharashtra: Tree fell on parked cars in Bandra East amid strong winds and heavy rain. pic.twitter.com/BfCeqnXwlJ
— ANI (@ANI) July 5, 2026