హౌస్ అరెస్ట్‌లు సిగ్గుచేటు
బీఆర్ఎస్ నేతలు అంటే సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకు అంత వణుకు, రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులను పోలీసులు ఎకడికకడ హౌస్ అరెస్ట్‌లు చేయడం, అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
- హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్
చిగురుమామిడి, సెప్టెంబర్ 13: బీఆర్ఎస్ నేతలు అంటే సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకు అంత వణుకు, రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులను పోలీసులు ఎకడికకడ హౌస్ అరెస్ట్‌లు చేయడం, అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లో ఉన్నట్టా..? కాంగ్రెస్‌లో చేరినట్టా..? స్పష్టం చేయాలని, ప్రెస్మీట్లో నీళ్లు నములుతూ స్పష్టత లేకుండా మాట్లాడుతున్న అరికెపూడికి దమ్ముంటే గులాబీ కండువా వేసుకొని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటో తన పకన పెట్టుకుని మాట్లాడాలని సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతీసారి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఏదో ఒక హైడ్రామాకు తెరలేపి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యేపై దాడి చేయించి, సీఎం నేడు శాంతి భద్రతల పేరెత్తడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్వేషాలను రెచ్చగొట్టవద్దని డీజీపీ ఏకపక్షంగా బీఆర్ఎస్ నాయకులకు చెప్పడం ఎమర్జెన్సీని తలపించేలా కనిపిస్తోందన్నారు. దాడికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, అరికెపూడి గాంధీ అనుచరులైతే, వార్నింగ్ మాత్రం బీఆర్ఎస్ నేతలకు ఇస్తారా.. ఇది హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే విపక్ష ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని, తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

