Balka Suman | మాకు అరెస్టులు, కేసులు కొత్త కాదు.. చంచల్‌గూడ జైలు బయట బాల్క సుమన్
Balka Suman | అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు అరెస్టులు, కేసులు కొత్త కాదని తెలిపారు.
Balka Suman | అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. సింగరేణి ఆస్తుల అంశంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో గత నెల 30 నుంచి జైలులో ఉన్న ఆయనకు హైకోర్టు బుధవారం నాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి.
జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్రం మొత్తం అవినీతి, కుంభకోణాలమయమైందని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు మరో ఉద్యమం చేయకతప్పదని అన్నారు. సింగరేణిలో అంత సవ్యంగా ఉంటే కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కోవాలని సవాలు విసిరారు.
బీఆర్ఎస్కు అరెస్టులు, కేసులు కొత్త కాదని బాల్క సుమన్ తెలిపారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తనపై 226 కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని తెలిపారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతుందని పేర్కొన్నారు. తమకు కోర్టులపై నమ్మకం ఉందని చెప్పారు.
సింగరేణిలో అంత సవ్యంగా ఉంటే.. కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలను ఎదురుకోవాలి. pic.twitter.com/Owo2bAuBY0
— Balka Suman (@balkasumantrs) June 25, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Balka Suman
- BRS
- Congress
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

