Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Sunil Gavaskar : తొలి టీ20లో విజయోత్సాహంతో రాంచీలో దంచేసిన భారత జట్టు అనూహ్యంగా కంగుతిన్నది. టీమిండియా ఓటమికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించిన మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఒక్క ఓవర్ అంతా తారుమారు చేసిందని అన్నాడు.
Sunil Gavaskar : తొలి టీ20లో విజయోత్సాహంతో రాంచీలో దంచేసిన భారత జట్టు అలవోకగా గెలుస్తుందనుకుంటే అనూహ్యంగా కంగుతిన్నది. టాపార్డర్ మెరుపులతో 249 పరుగులు చేసినప్పటికీ బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా ఓటమి పాలైంది. రెండో టీ20లో టీమిండియా ఓటమికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించిన మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఒక్క ఓవర్ అంతా తారుమారు చేసిందని అన్నాడు. కుల్దీప్ యాదవ్‌కు బదులుగా మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు బంతి ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని సన్నీ అభిప్రాయపడ్డాడు.
ధనాధన్ ఆటకు కేరాఫైన టీ20ల్లో 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ ఉఫ్‌మనిపించింది. రాంచీలో ఆదిలోనే మూడు కీలక వికెట్లు తీసిన మయాంక్ యాదవ్(3-36) ధాటికి కష్టాల్లో పడినా షాయ్ ఓప్(102 నాటౌట్) అసాధారణ ఆటతో మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో అసలు విలన్ కుల్దీప్ యాదవ్ అనే చెప్పాలి. వన్డేల్లో గొప్పగా రాణించిన అతడు.. రాంచీలో మాత్రం ఒకేఒక ఓవర్‌తో టీమిండియాను ఓటమి అంచున నెట్టాడు. కెప్టెన్ హోప్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన షెర్ఫానే రూథర్‌ఫొర్డ్(84) వికెట్ తీసిన అతడు.. ఆ తర్వాతి ఓవర్లో మాత్రం భారతజట్టు పాలిట విలనయ్యాడని సునీల్ గవాస్కర్ అన్నాడు.
Sunil Gavaskar criticized India’s bowling tactics in Ranchi, stating Mayank Yadav should have bowled the critical 17th over instead of Kuldeep Yadav. Kuldeep conceded 24 runs with 3 sixes as WI chased 250 to win by 6 wickets. Gavaskar noted Mayank’s 3 earlier wickets made him the ideal choice to break the match.
#INDvWI #SunilGavaskar #MayankYadav #KuldeepYadav #Cricket #Ranchi #TeamIndia #T20I
— dailymattr (@dailymattr_news) October 10, 2026
‘భారీ స్కోర్ల మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చేసిన పెద్ద పొరపాటు కుల్దీప్తో 17వ ఓవర్ వేయించడం. ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 24 రన్స్ రావడంతో విండీస్ విజయం తేలికైంది. ఆ ఓవర్ గనుక మయాంక్ యాదవ్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌లతో వేయించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎందుకంటే.. అప్పటివరకూ మయాంక్ ఎకానమీ ఓవర్‌కు 12 ఉంది. అప్పటికీ విండీస్ విజయానికి మరిన్ని రన్స్ కావాలి.17వ ఓవర్లో మరో వికెట్ లభించి ఉంటే.. మ్యాచ్ టీమిండియా వైపు తిరిగేది. అంతేకాదు 19వ ఓవర్లో శివం దూబేతో బౌలింగ్ చేయించడం సరైన నిర్ణయం కాదు. విండీస్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడుతున్నందున అతడి బదులు ఆ ఓవర్ కుల్దీప్ వేయాల్సింది’ అని గవాస్కర్ పేర్కొన్నాడు. రాంచీలో థ్రిల్లింగ్ విక్టరీతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది పర్యాటక జట్టు. ఐదు టీ20ల సిరీస్‌లో కీలమైన మూడో మ్యాచ్ అక్టోబర్ 11 ఆదివారం జరుగనుంది.
When in need, call KD! 👊 🇮🇳
#KuldeepYadav breaks the 120-run stand between Shai Hope & Sherfane Rutherford at a right time 🔥🙌
#INDvWI 2nd T20I | LIVE NOW 👉
https://t.co/RHr9KuCW0r https://t.co/uET8VuHCYZ— Star Sports (@StarSportsIndia) October 9, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

