Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Mukhara (K) | కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బతుకంతా పచ్చగుండె.. మళ్లీ బతుకులు బాగుపడాలంటే సారే రావాలి.. కారే గెలవాలి అంటూ ఆదిలాబాద్ జల్లా ముఖరా మహిళలు అన్నారు.
ఆదిలాబాద్ : కేసీఆర్ సార్ ( KCR Sir ) ఉన్నప్పుడే బతుకంతా పచ్చగుండె.. మళ్లీ బతుకులు బాగుపడాలంటే సారే రావాలి.. కారే గెలవాలి అంటూ ఆదిలాబాద్ జల్లా ముఖరా ( Mukhara (K) మహిళలు అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభం రోజున కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటూ బంతిపూల తోటలో ఆయన చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రేవంత్ పాలనలో తమ బతుకులు ఆగమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ జీవితాలు బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ పాలన రావాల్సిందేనని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఉన్నప్పుడే ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరలు అందించి, పండుగను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహించేవారని గుర్తు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ బతుకమ్మ చీరలు ఇవ్వకుండా మహిళలను నిలువునా మోసం చేసిందని, గ్రామాల్లో పండుగ వాతావరణమే కరువైందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన చీరలు కట్టుకుని ఊరూరా ఎంతో సంబురంగా బతుకమ్మ ఆడుకునేవారమని గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ పాలనలో త్రీఫేజ్ కరెంట్ లేక, సాగునీరు అందక పంటలు నిలువునా ఎండి పోతున్నాయని ధ్వజమెత్తారు. రైతులకు సరిగ్గా కరెంట్ కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇదని విమర్శించారు. కేసీఆర్ ఉన్నప్పుడే 24 గంటల ఉచిత కరెంట్, సమయానికి రైతుబంధు, పొలాలకు పుష్కలంగా నీళ్లు, ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్ అందేవని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, అర్చన, ఇందుబాయి, రేఖ, సరోజ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

