బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
కొబ్బరి బోండాల కోసం కొబ్బరి చెట్టును మిషన్‌తో కోస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాకు చెందిన...
– ఫిల్టర్ బెడ్ వద్ద ఘటన.. గతంలోనూ చెట్ల నరికివేత
రుద్రంపూర్, అక్టోబర్ 10 : కొబ్బరి బోండాల కోసం కొబ్బరి చెట్టును మిషన్‌తో కోస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాకు చెందిన సంతోష్ రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్న కొబ్బరి చెట్టును కొబ్బరి బోండాల కోసం మిషన్‌తో కోస్తుండగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు. అనంతరం డయల్ 112కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు అతడిని అప్పగించారు.
చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలి
ఫిల్టర్ బెడ్ పరిసరాల్లో గతంలోనూ కొబ్బరి బోండాల కోసం పలుమార్లు చెట్లను నరికివేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలపై పర్యావరణ ప్రేమికులు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి, చెట్లను నరికే వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రకృతి పరిరక్షణకు కీలకమైన చెట్లను స్వార్థ ప్రయోజనాల కోసం నరికివేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్కే యాసిన్ ఈ ఘటనపై దృష్టి సారించి, చెట్ల నరికివేతకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

