చందంపేట(దేవరకొండ), ఫిబ్రవరి 9 : దేవరకొండ అభివృద్ధికి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం పట్టణంలోని 8, 9, 7 వార్డుల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న విద్యావంతులు, యువకులకు అవకాశం ఇవ్వాలని, ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్కు ఓటు వేసి ఇబ్బందులు పడొద్దన్నారు.
ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే దేవరకొండ అభివృద్ధి జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కేతావత్ బీల్యా నాయక్, వడ్త్యా రమేశ్ నాయక్, నేనావత్ కిషన్ నాయక్, గాజుల ఆంజనేయులు, టీవీఎన్ రెడ్డి, వల్లపురెడ్డి, కంకణాల వెంకట్రెడ్డి, హరిలాల్, ముత్యాల రవి, శంకర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, సుభాశ్ గౌడ్, చారి, నగేశ్, పరిపూర్ణాచారి, అమరేశ్, మధు, శ్రీనివాసాచారి, ఫిరోజ్, ముత్యాల చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.