కేసీఆర్ హయాంలోనే దేవరకొండ అభివృద్ధి
దేవరకొండ అభివృద్ధికి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం పట్టణంలోని 8, 9, 7 వార్డుల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న విద్యావంతులు, యువకులకు అవకాశం ఇవ్వాలని, ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలన్నారు.
- మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
చందంపేట(దేవరకొండ), ఫిబ్రవరి 9 : దేవరకొండ అభివృద్ధికి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం పట్టణంలోని 8, 9, 7 వార్డుల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న విద్యావంతులు, యువకులకు అవకాశం ఇవ్వాలని, ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి ఇబ్బందులు పడొద్దన్నారు.
ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే దేవరకొండ అభివృద్ధి జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కేతావత్ బీల్యా నాయక్, వడ్త్యా రమేశ్ నాయక్, నేనావత్ కిషన్ నాయక్, గాజుల ఆంజనేయులు, టీవీఎన్ రెడ్డి, వల్లపురెడ్డి, కంకణాల వెంకట్‌రెడ్డి, హరిలాల్, ముత్యాల రవి, శంకర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, సుభాశ్ గౌడ్, చారి, నగేశ్, పరిపూర్ణాచారి, అమరేశ్, మధు, శ్రీనివాసాచారి, ఫిరోజ్, ముత్యాల చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

