స్టార్మర్ పదవికి ‘ఎప్స్టీన్’ గండం.. ఎప్స్టీన్ ఫైల్స్‌తో బ్రిటన్ ప్రధాని పదవిని కోల్పోయే ప్రమాదం
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు పదవీ గండం ఏర్పడింది. ఏడాదిన్నర కాలమే పదవిలో ఉన్న తనను ప్రధానిగా కొనసాగించాలని ఆయన లేబర్ పార్టీకి చెందిన పార్టీ ఎంపీలకు నచ్చచెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తున్నది. స్టార్మర్ స్థానంలో బ్రిటన్ చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ముస్లిం మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు జోరుగా వదంతులు వినిపిస్తున్నాయి.
- దేశానికి తొలి ముస్లిం మహిళా ప్రధానిగా షబానా కు అవకాశం!
లండన్, ఫిబ్రవరి 9: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు పదవీ గండం ఏర్పడింది. ఏడాదిన్నర కాలమే పదవిలో ఉన్న తనను ప్రధానిగా కొనసాగించాలని ఆయన లేబర్ పార్టీకి చెందిన పార్టీ ఎంపీలకు నచ్చచెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తున్నది. స్టార్మర్ స్థానంలో బ్రిటన్ చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ముస్లిం మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు జోరుగా వదంతులు వినిపిస్తున్నాయి. లేబర్ పార్టీకి చెందిన 45 ఏండ్ల షబానా మహమూద్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం స్టార్మర్ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేస్తున్న షబానా లేబర్ పార్టీకి సారథ్యం వహించేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తున్నది.
అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ యావత్ యూరప్‌లోని అనేక ప్రభుత్వాల్లో ప్రకంపసనలు సృష్టిస్తున్నది. వాషింగ్టన్‌లోని బ్రిటిష్ మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్కు, లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్కి మధ్య సంబంధాలు ఉన్నట్లు ఎప్స్టీన్ ఫైల్స్ బయటపెట్టడంతో ఆదివారం తన ప్రత్యేక సలహాదారుడైన మాండెల్సన్‌ను స్టార్మర్ వదులుకోవలసి వచ్చింది. అంతేగాక లేబర్ పార్టీకి చెందిన చట్టసభ్యుల మద్దతును స్టార్మర్ కోల్పోతుండడంతో ఆయన ఏ క్షణంలోనైనా పదవి నుంచి వైదొలగవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయని తెలిసినప్పటికీ మాండెల్సన్‌ను అత్యంత కీలకమైన పదవిలో నియమించాలని 2024లో స్టార్మర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నది.
షబానా మహమూద్ న్యాయవాది-రాజకీయ నాయకురాలు. స్టార్మర్‌కు మంచి మిత్రురాలిగా కూడా ఆమెకు పేరుంది. మంచి వక్తగా ఆమెకు పార్టీలో గుర్తింపు ఉంది. బర్మింగ్‌హామ్‌లో జుబైదా, మహమూద్ అహ్మద్ దంపతులకు జన్మించిన షబానా తల్లిదండ్రులకు పాక్‌లోను, పాక్ ఆక్రమిత కశ్మీరులోని మీర్పుర్ పట్టణంలో మూలాలు ఉన్నాయి. 2002లో ఆక్స్‌ఫర్డ్‌లోని లింకన్ కాలేజీ నుంచి న్యాయ శాస్త్ర పట్టా పుచ్చుకున్న షబానా తదుపరి ఇన్స్ ఆఫ్ కోర్టు స్కూలు ఆఫ్ లాలో బార్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి బారిస్టర్‌గా కూడా అయ్యారు. 2010లో దేశంలో మొదటిసారి ఎంపీలుగా గెలుపొందిన ముస్లిం మహిళలైన రుషానానా అలీ, యాస్మిన్ ఖురేషీలలో ఒకరిగా నిలిచారు. లేబర్ పార్టీ నిర్ణయిస్తే దేశంలో తొలి ముస్లిం మహిళా ప్రధానిగా ఆమె చరిత్రలో నిలుస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

