న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి వాహన తయారీ సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎక్సేంజ్ ఆఫర్లతోపాటు డిస్కౌంట్ అంటూ ఊదరగొడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి జర్మనీకి చెందిన హోండా కూడా చేరింది. ప్రస్తుత నెలలో హోండా తన మాడళ్ల ధరలను రూ.2 లక్షల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నట్టు ప్రకటించింది.
వీటిలో సిటీ, అమేజ్, ఎలివేటివ్ మాడళ్లు ఉన్నాయి. సిటీ, అమేజ్లపై రూ.1.97 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది. ఈ నెల చివరి వరకు మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఆఫర్లలో నగదు డిస్కౌంట్లు, ఎక్సేంజ్, స్క్రాపేజ్ ప్రయోజనాలు, లాయల్టీ బోనస్‌లతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా కల్పించనున్నది.