ఆమనగల్లు, జూలై 14 : సర్‌పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సర్ నియోజకవర్గ ఇన్చార్జి రజినీ సాయిచంద్ అన్నారు. మంగళవారం ఆమనగల్లులోని కళ్యాణి గార్డెన్లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్ఏ)తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సర్ నియోజకవర్గ ఇన్చార్జి రజినీ సాయిచంద్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ(సర్) ప్రక్రియపై పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి బూత్ పరిధిలోని దొంగ ఓట్లను ఏరివేయడంతోపాటు స్థానికులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, మాజీ జడ్పీటీసీ విజితారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సీనియర్ నాయకుడు ఖలీల్, సర్పంచులు, నాయకులుపాల్గొన్నారు.