నిషేధిత జాబితాలో వివిధ సర్వే నంబర్లను చేర్చడంతో ఆస్తులను కొనుగోలు చేయాలన్న విక్రయించాలన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల్లో వివిధ ప్రాంతాలను నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో తమ సొంత ఆస్తులను విక్రయించాన్న కొనుగోలు చెద్దామన్న రిజిస్ట్రేషన్లు కావడం లేదు. అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్, జూలై 14(నమస్తే తెలంగాణ): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి గతంలో అయిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఎందుకు కావడం లేదని అడిగితే.. వివిధ సర్వే నంబర్లలో ఉన్న భూములను నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చినందున కావడం లేదని సబ్ రిజిస్ట్రార్లు సమాధానం చెబుతున్నారు. కలెక్టరేట్ నుంచి ఎన్వోసీలు తీసుకువస్తే రిజిస్ట్రేషన్లు చేస్తామని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్న క్రమంలో కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ క్రయ, విక్రయదారులు తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా జిల్లాలో నిషేధిత జాబితాలో అనేక సర్వే నంబర్లను చేర్చారు.
మేడ్చల్ నియోజకవర్గంలోని గుండ్లపోచంపల్లి, రాయిలపూర్, అత్వేల్లిలో 240, 243, 157, 161, 162, 199, 143, 248, 249, 143, 252 పోచారంలో 50, 2, 8, 54, చెంగిచెర్లలో 33బై 2 నుంచి 33బై7, మేడిపల్లిలో 22, పర్యాతపూర్లో 26, 27, 28 సర్వే నంబర్లు ఉండగా మల్కాజిగిరి నియోజకవర్గంలో మౌలాలి, మల్కాజిగిరి, సఫిల్‌గూడ, గౌతంనగర్ డివిజన్లో ఉన్న సర్వే నంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఎన్వోసీలు ఇవ్వాలంటే తహసీల్దార్ నివేదిక అనంతరం ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ ఓకే చేస్తే కలెక్టర్ జారీ చేస్తారు. ఎన్వోసీలు త్వరితగతిన జారీ చేయాలని లేదా నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లను తొలగించాలని బాధితులు కోరుతున్నారు. సర్వే నంబర్లను తొలగించేలా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఉద్యమం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్న విషయం విధితమే.