ఆర్కేపురం, జూలై 14 : నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జూలై 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియం మైదానంలో యువ సంగ్రామ సదస్సు స్థలాన్ని సోమవారం ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, నోముల భగత్, బీఆర్ఎస్వ్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పరిశీలించారు. కాగా సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు.