Mallikarjun Kharge: ప్రధాని, హోంమంత్రి మౌనం వీడాలి.. లేదంటే విద్యార్థులు మళ్లీ గుణపాఠం చెబుతారు: మల్లిఖార్జున్ ఖర్గే
Mallikarjun Kharge: ఢిల్లీలో పోలీసుల చర్యలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మౌనాన్ని వీడాలని, లేదంటే మళ్లీ విద్యార్థులు గుణపాఠం చెబుతారని రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ కేంద్రాన్ని హెచ్చరించారు. పోలీసుల లాఠీఛార్జ్ పట్ల ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు.
న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ఇవాళ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన విద్యార్థులన నిరసనను ఉద్దేశిస్తూ.. పోలీసుల చర్యలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మౌనాన్ని వీడాలని, లేదంటే మళ్లీ విద్యార్థులు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పోలీసుల లాఠీఛార్జ్ పట్ల ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. రాజ్యసభలో చర్చలో పాల్గొన్న ఖర్గే మాట్లాడుతూ.. నిరసనకారులపై దాడి పట్ల ప్రభుత్వం మౌనంగా ఉందని, దీనిపై విద్యార్థులు నిరాశతో ఉన్నారన్నారు. ఒకవేళ వాళ్ల డిమాండ్లను పట్టించుకోకపోతే, వాళ్లు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేపట్టనున్నట్లు ఖర్గే తన వార్నింగ్‌లో తెలిపారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా విద్యార్థుల నిరసనలపై మౌనంగా ఉన్నారని, ఒకవేళ వాళ్లు మాట్లాడకుంటే, వారికి విద్యార్థులు గుణపాఠం చెబుతారన్నారు.
“HM responsible for pellet gun use on students, now hiding behind closed doors; will DRAG YOU OUT some day.
The faced weapons, they were seeking just dialogue.”
– LoP Kharge uses unparliamentary language during anti-paper leak debate in RS pic.twitter.com/aUuygFyxB6
— News Arena India (@NewsArenaIndia) July 30, 2026
విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు కేంద్ర మంత్రి అమిత్ షా బాధ్యుడు అని, ఈ అంశంలో ఆయన తప్పించుకోలేరన్నారు. విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌కు ప్రభుత్వం కారణం వెల్లడించాలన్నారు. లాఠీఛార్జ్‌కు కోసం ఎవరు ఆదేశించారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎప్.. కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయన్నారు. హోంశాఖ అప్రూవల్ లేకుండా ఇదంతా జరగదన్నారు. పోలీసుల చర్యలపై అమిత్ షా స్టేట్మెంట్ ఇవ్వాలని ఖర్గే డిమాండ్ చేశారు.
బీజేపీ రాకీయాల వల్లే దేశంలో లీకులు, నిరసనలు, లాఠీఛార్జ్‌లు జరుగుతున్నట్లు ఆరోపించారు. చిల్లర రాజకీయాల్లో జోక్యం చేసుకోకుంటే ఇవన్నీ జరిగేవి కావు అని ఖర్గే అన్నారు. నిరసనకారులకు జరిగిన ప్రతి గాయానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. పేపర్ లీకేజీ నిరోధక బిల్లును గతంలో ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర సర్కారు రాజకీయాల్లో నిమగ్నమైందని, కానీ పిల్లల భవిష్యత్తును విస్మరించిందన్నారు. నిరసనలను నియంత్రించేందుకు బిల్లు తెచ్చారు, కానీ విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం కాదన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత సమయం ప్రకారం నిర్వహించే వార్షిక పరీక్షల క్యాలెండర్‌ను రిలీజ్ చేయాలని కోరారు. విద్యా సంస్థలకు ఆర్ఎస్ఎస్ వ్యక్తులు నేతృత్వం వహిస్తున్నారని, వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలను ట్రెజరీ సభ్యులు ఖండించారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొన్నది. మనుస్మృతిపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించాలని సభాపక్ష నేత జేపీ నడ్డా కోరారు. ఖాలీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.
#WATCH | Heavy sloganeering in Rajya Sabha as Leader of Opposition Mallikarjun Kharge delivers his speech.
Opposition MPs demand action against Union Minister Giriraj Singh and ask him to apologise over his remarks.
(Source: Sansad TV) pic.twitter.com/02U6HDVJhQ
— ANI (@ANI) July 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

