Stock Market | మూడు రోజుల నష్టాలకు ముగింపు పలుకుతూ దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 303 పాయింట్ల లాభంతో 60,261 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 17,956 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 290 పాయింట్లు పెరిగి 42,371 పాయింట్ల వద్ద స్థిరపడింది. వారం చివరి రోజైన శుక్రవారం సూచీలు బ్యాంక్, ఐటీ, మెటల్, పీఎస్‌యూ రంగాల షేర్లు బలాన్ని ప్రదర్శించాయి. ఉదయం సెన్సెక్స్ 60,044.96 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,418.26 – 59,628 పాయింట్ల మధ్య కదలాడింది.
చివరకు 303.15 పాయింట్ల లాభంతో 60,261.18 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17,867.50 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలై.. ఇంట్రాడేలో 17,999.35 వద్ద గరిష్ఠాన్ని, 17,774.25 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 90.40 పాయింట్ల లాభపడి.. 17,956.60 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడి 81.33 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30లో 20 షేర్లు లాభాలను నమోదు చేశాయి. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు రెండు శాతం చొప్పున లాభపడ్డాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఎన్టీపీసీ, మారుతీ షేర్లు లాభయపడ్డాయి. టైటాన్, నెస్లే ఇండియా, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, సన్‌ఫార్మా, విప్రో తదితర షేర్లు నష్టపోయాయి.