విశ్వంత్, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’. సంతోష్ కంభంపాటి దర్శకుడు. వేణు మాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 14న విడుదలకానుంది. ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో విశ్వంత్ మాట్లాడుతూ ‘నేటితరం యువతకు నచ్చే కాన్సెప్ట్ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. అందరూ థియేటర్లో చూసి సినిమాను ఎంజాయ్ చేయండి’ అని తెలిపారు. ‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్లో కొత్తదనంతో కూడిన సబ్జెక్ట్ ఇది’ అని దర్శకుడు పేర్కొన్నారు. తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 350, యూ.ఎస్‌లో 100 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని, యువత మెచ్చే చిత్రమవుతుందని నిర్మాతలు తెలిపారు. తన మనసుకు దగ్గరైన పాత్ర ఇదని కథానాయిక మాళవిక సతీషన్ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.