విశ్వంత్, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్'. సంతోష్ కంభంపాటి దర్శకుడు. వేణు మాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 14న విడుదలకానుంది.
‘టైటిల్ చూసి ఇదొక బోల్డ్ కంటెంట్ సినిమా అనుకుంటారు కానీ.. క్లీన్ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కించారు. చక్కటి వినోదంతో పాటు భావోద్వేగాలతో సాగుతుంది’ అని చెప్పింది మాళవిక సతీషన్.