– ఎన్నికల హామీని అమలు చేసిన సర్పంచ్ కుంచాల శ్రీనివాస్‌రెడ్డి
తుంగతుర్తి, జనవరి 09 : తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ ను శుక్రవారం గ్రామ పంచాయతీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎవరైనా అకాల మరణం చెందితే ఉచితంగా ఫ్రీజర్ బాక్స్ ను ఉపయోగించుకోవచ్చన్నారు. తమ తండ్రి దివంగత కుంచాల వెంకట్రామిరెడ్డి జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో ఫ్రీజర్‌ను అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దొంగరి శ్రీనివాస్, కడారి దాసు, బింగి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.