Kevin Pietersen : యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ దారుణంగా ఓడడంతో కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ (Brendon McCullum)ను తప్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇటీవల సుదీర్ఘ ఫార్మాట్లో ఆ జట్టు ఆట అధ్వాన్నంగా ఉండడంపై మండిపడుతున్న మాజీలు కొత్త కోచ్‌ను నియమించాలని చెబతున్నారు. ఇప్పటికే ఆ దేశ బోర్డు యాషెస్ పరాజయంపై సమీక్షకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇదివరకు కోచింగ్ ఇచ్చిన ఆండీ ఫ్లవర్ (Andy Flower)ను మళ్లీ తీసుకోవాలని కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) సూచించాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో ‘బజ్‌బాల్’ ఆటను నమ్ముకున్న ఇంగ్లండ్ నిరుడు భారత జట్టు చేతిలో, తాజాగా యాషెస్ సిరీస్‌లో భంగపడింది. వరుసగా నాలుగోసారి యాషెస్‌ను కోల్పోవడాన్ని అవమానంగా భావిస్తున్న ఆ దేశ బోర్డు భారీ మార్పులకు సిద్ధమవుతోంది. హెడ్‌కోచ్ మెక్కల్లమ్ స్థానంలో మరొకరిని నియమించడం ఖాయమనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ మళ్లీ పుంజుకోవాలంటే గతంలో కోచింగ్ ఇచ్చిన ఆండీ ఫ్లవరే పెద్ద దిక్కు అని పీటర్సన్ శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించాడు.
This is a WILD thought. I reckon one of my wildest.
Can England bring back Andy Flower now that he’s changed and in line with the modern day player?
He gets Test Cricket.
I’ve been told by many players that he’s changed his ways since our drama.
He’s winning leagues so…— Kevin Pietersen🦏 (@KP24) January 9, 2026
‘ఈ నిర్ణయం చాలా గొప్పది. ఆండీ ఫ్లవర్‌ను మళ్లీ ఇంగ్లండ్ కోచ్‌గా నియమిస్తే అతడు రాత మారుస్తాడు. అతడికి టెస్టు క్రికెట్‌పై పట్టుంది. అతడు కోచ్‌గా ఉన్నప్పుడు ఇంగ్లండ్ ఆట చాలా మెరుగుపడింది. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్లో ఆండీ ఫ్లవర్ టైటిళ్లు గెలుస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం’ అని పీటర్సన్ పేర్కొన్నాడు.
జింబాబ్వే మాజీ ఆటగాడైన ఆండీ ఫ్లవర్ 2010లో ఇంగ్లండ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి హయాంలో ఆస్ట్రేలియాను 3-1తో ఓడించిన ఇంగ్లండ్ 2010-11లో యాషెస్ సిరీస్ గెలుపొందింది. ఆ తర్వాత భారత పర్యటనలోనూ ఆ జట్టు విజేతగా నిలిచింది.
Former England coach Andy Flower feels India could exploit the home team’s aggressive ‘Bazball’ approach. pic.twitter.com/ud6tfFoLs9
— Sportstar (@sportstarweb) June 23, 2025
అంతేకాదు ప్రపంచకప్ కోసం నిరీక్షిస్తున్న ఇంగ్లండ్ కలను సాకారం చేసింది కూడా అతడే. 2010లో టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌లో అవతరించింది. 2014లో ఇంగ్లండ్ కోచ్‌గా పదవీకాలం ముగియడంతో ఫ్రాంచైజీ క్రికెట్లో అడుగుపెట్టాడు ఫ్లవర్. ఐపీఎల్లో 18 ఏళ్లుగా ట్రోఫీ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న ఆర్సీబీని విజేతగా నిలబెట్టాడు. అంతకుముందు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు కప్ కొట్టడంలో కీలకమయ్యాడు ఆండీ ఫ్లవర్.