ఊట్కూరు : నారాయణపేట జిల్లా ఊట్కూరు ( Ootkuru ) గ్రామాన్ని ముంపు గ్రామంగా (Flooded village) ప్రకటించాలని పంచాయతీ పాలకవర్గం అధికారులకు వినతి పత్రం అందజేసింది. శుక్రవారం గ్రామంలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో( Kodangal Lift ) భాగంగా భూములు కోల్పోయిన రైతులతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనుతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ గ్రామపంచాయతీ సర్పంచ్, సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఉట్కూరు పెద్ద చెరువు ను రిజర్వాయర్ గా మార్చితే గ్రామంలోకి ఊట నీరు చేరుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.