ఇటీవల ‘ఓజీ’తో బ్లాక్బస్టర్ హిట్కొట్టిన దర్శకుడు సుజిత్ తన తదుపరి చిత్రాన్ని నానితో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ను ఖరారు చేశారని సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిసింది. యూరప్ నేపథ్యంలో డార్క్ హ్యూమర్, యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఇందులో మలయాళీ అగ్రహీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రను పోషించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ నేపథ్యంలో పీరియాడిక్గా డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాకే ‘బ్లడీ రోమియో’ సెట్లో నాని జాయిన్ కాబోతున్నారు.