Thalapathy Vijay | తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్, నటుడు విజయ్ (Vijay) గత శనివారం రాత్రి కరూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede)లో మృతి చెందిన వారి సంఖ్య 41కి చేరిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు టీవీకే కరూర్ జిల్లా సెక్రటరీ మథియజగన్ను అరెస్ట్ చేశారు.
సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నలభై మంది మృతికి కారణమైనందున తొక్కిసలాటకు బాధ్యుడిగా భావిస్తున్న మథియజగన్ను హత్యానేరం, కుట్రకోణం, ప్రజల భద్రతకు ముప్పు కలిగించారనే నెపంతో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాట ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. తాజాగా ఈ ఘటన పట్ల విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.
నేనెప్పుడూ నా జీవితంలో ఇంత బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోలేదు. ఈ పర్యటనలో నన్ను చూడటానికి ఇంత మంది రావడానికి వారంతా నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతే కారణం. నేను వారికి రుణపడి ఉన్నా. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. నిజం తప్పకుండా బయటపడుతుంది. ముఖ్యమంత్రి సార్ మీరు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే, మీరు చేయగలిగినదంతా చేయండి.. కానీ వారిని (ప్రజలను మాత్రం) ముట్టుకోకండి. మీరేమైనా చేయాలనుకుంటే నేను ఇంట్లో లేదా ఆఫీసులోనే ఉంటానంటూ హెచ్చరించాడు విజయ్.
— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025
Kuberaa | కుబేర మీ ముందుకు వచ్చేస్తున్నాడు.. ధనుష్ ఫ్యాన్స్ రెడీనా..?
Junior | మూడు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కిరీటి జూనియర్.. మూవీ లవర్స్ రియాక్షన్ ఏంటో మరి..?
Rukmini Vasanth | కాంతార హీరోయిన్ రుక్మిణి వసంత్ అడ్వెంచరస్ సర్ఫింగ్.. ఎక్కడికెళ్లిందో మరి..!