టోక్యో: ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు కార్లొస్ అల్కరాజ్ కెరీర్లో మరో ఏటీపీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టోక్యో వేదికగా జరిగిన జపాన్ ఓపెన్‌లో అతడు విజేతగా నిలిచాడు.
మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో అల్కరాజ్.. 6-4, 6-4తో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించాడు. తద్వారా ఇటీవలే లేవర్ కప్‌లో ఫ్రిట్జ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులుతీర్చుకున్నాడు. స్పెయిన్ కుర్రాడికి ఈ ఏడాది ఇది 8వ టైటిల్ కాగా కెరీర్లో 24వది కావడం విశేషం.