హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీ డివిజన్ వన్డే లీగ్ చాంపియన్షిప్లో చమ్స్ 11 కెప్టెన్ శ్రేయస్ అందె (100) శతకంతో మెరిశాడు. కేవీఆర్ క్రికెట్ ఎరీనా వేదికగా అభినవ్ కాల్ట్స్తో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ సెంచరీకి తోడు నక్ష్ రెడ్డి (42) రాణించడంతో ఆ జట్టు 47 ఓవర్లలో 212/6 స్కోరు చేసింది.
ఛేదనలో అభినవ్ జట్టు 42.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తిచేయడంతో శ్రేయస్ శతకం వృథా అయింది.