షార్జా: ప్రపంచ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయిన వెస్టిండీస్‌పై క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న నేపాల్ ఏకంగా సిరీస్ విజయాన్ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. షార్జా వేదికగా ఇరుజట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను గెలుచుకున్న నేపాల్.. సోమవారం అర్ధరాత్రి ముగిసిన రెండో మ్యాచ్‌లోనూ విండీస్‌ను 90 రన్స్ తేడాతో ఓడించింది.
కానీ మంగళవారం ముగిసిన మూడో టీ20లో విండీస్ పది వికెట్ల తేడాతో గెలిచినా నేపాల్ 2-1 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వంతో పాటు టెస్టు హోదా కల్గిన దేశంపై సిరీస్ విజయం సాధించడం నేపాల్‌కు ఇదే మొదటిసారి. మూడో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్.. 20 ఓవర్లలో 122కే ఆలౌట్ అయింది. ఛేదనను విండీస్ 12.2 ఓవర్లలోనే వికెట్లేమీ నష్టపోకుండా దంచేసింది.