Poonam Kaur | సినిమాల కంటే సోషల్ మీడియా వ్యాఖ్యలతో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతూ ఉన్న నటి పూనమ్ కౌర్. తాజాగా మరోసారి వివాదాస్పద ట్వీట్‌తో వార్తల్లోకి ఎక్కింది. ఇటీవలే ఓజీ సినిమాను ప్రశంసించిన ప్రముఖులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆమె, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించడంతో కొత్తగా మెగా vs నందమూరి అభిమానుల మధ్య చర్చకి బీజం పడింది. పూనమ్ కౌర్..2024, సెప్టెంబర్ 1న ఓ ట్వీట్ చేస్తూ… అందులో ‘బాలయ్య పెద్ద వృక్షం లాంటి వారు. అది అన్ని సీజన్లలోనూ మనుషులకి, జంతువులకు నీడనిస్తుంటుంది. ఆదిత్య 369 నుంచి భగవంత్ కేసరి వరకు ఆయన చిన్న పిల్లాడిలా ఉత్సాహంగానే ఉన్నారు. అది ఆయనకు దేవుడు, తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన ఆశీర్వాదం’అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది . దానికి పూనమ్.. బాలయ్య పాటకి డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోను కూడా జత చేసింది. ఇందులో ‘సమర సింహారెడ్డి’ పాటకు ఆమె స్టేజ్ పై డ్యాన్స్ చేస్తుంటే ఉత్సాహంగా వీక్షించాడు బాలయ్య.
ఇక అప్పటి ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ పూనమ్ తాజాగా మరో ట్వీట్ చేయగా ఇది క్షణాల్లో వైరల్ అయింది. బాలయ్య ఎప్పుడూ చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా ఉంటారని నేను ఎప్పుడూ చెబుతుంటాను. దేవుడు కొందరు వ్యక్తుల్ని ఓ లక్ష్యం కోసం సాధనంలా సృష్టిస్తాడు. అది సమయానుసారం బయటపడుతుంది అని రాసుకొచ్చింది. పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్ నందమూరి అభిమానులను ఆనందింపజేస్తుండగా, మెగా అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేస్తున్నాయి. పలువురు సోషల్‌మీడియా యూజర్లు ఆమెపై ఘాటు కామెంట్లు చేశారు. బాలయ్య అన్న మాటలు మరిచిపోయావా?.. అంటూ మహిళలపై బాలకృష్ణ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ను కించపరిచిన నువ్వు, ఇప్పుడు బాలయ్యపై పొగడ్తలు ఎందుకు? అంటూ మరి కొందరు ఆమె వైఖరిని విమర్శిస్తున్నారు. సినిమాల్లో సక్సెస్ కాకపోవడంతో ఇలాంటి ట్వీట్లు చేసి ఫేమస్ అవ్వాలని చూస్తున్నావా? అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. కాగా, ఇటీవలే బాలయ్య, ఎమ్మెల్యే హోదాలో చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేయగా, మెగాస్టార్ చిరంజీవి తాను వాటిని ఆమోదించబోనని ప్రెస్ నోట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ మధ్య ఇప్పటికే వాడివేడిగా సోషల్ మీడియా వార్ జరుగుతున్న వేళ, పూనమ్ ఈ ట్వీట్ చేసి మరింత హీట్ పెంచిందని ట్రోల్ చేస్తున్నారు.
🫶 ballaya – as I always said child like energy – god makes people instrument for a purpose which is revealed with time 😇. https://t.co/b0VufEUBw8
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 30, 2025