Annapoorani | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) టైటిల్ రోల్లో నటించిన చిత్రం అన్నపూరణి (Annapoorani). నయనతార 75వ ప్రాజెక్టుగా వచ్చిన ఈ చిత్రాన్ని నీలేష్ కృష్ణ (Nilesh Krishna) డైరెక్ట్ (డెబ్యూ) చేశాడు. సనాతన బ్రాహ్మణ అమ్మాయి అయిన అన్నపూరణి తన ఇంటి నుండి బయటకు వెళ్లి దేశంలోనే అతిపెద్ద, ఉత్తమ చెఫ్ కావాలని బలంగా కోరుకుంటుంది.
అన్నపూరణి తన కలలను సాధించడానికి ఎలా ముందుకు వస్తుందనే నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విశ్వహిందూ పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ గతేడాది ఈ సినిమాను తొలగించింది. నయనతార క్షమాపణలు కూడా చెప్పింది. అయితే ఈ మూవీ మళ్లీ ఓటీటీలోకి రీఎంట్రీ ఇచ్చింది. రేపటి నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.
గతంలో వివాదానికి కారణమైన సన్నివేశాలను మేకర్స్ తొలగించారు. ఈ నేపథ్యంలో మూవీ రన్‌టైం 10 నిమిషాలు తగ్గింది. అన్నపూరణి 2 గంటల 15 నిమిషాల టైంతో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందన్నమాట. ఈ సినిమా చుట్టూ వివాదం నెలకొని ఇప్పటికే ఏడాదిన్నర దాటింది. మరి ఇన్నాళ్లకు తిరిగి ఓటీటీలోకి వస్తున్న నయనతార సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
జియో స్టూడియోస్, నాడ్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్లపై జతిన్ సేతి, ఆర్ రవిచంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. జై, సత్యరాజ్, కేఎస్ రవికుమార్, రెడిన్ కింగ్స్లే, అచ్యుత్ కుమార్, కుమారి సచు, రేణుక, కార్తీక్ కుమార్, సురేశ్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించారు. ఎస్ థమన్ సంగీతం అందించాడు.
Nayanthara’s controversial movie #Annapoorani (Hindi version) is streaming from tonight on @JioHotstar 🍿!!#OTT_Trackers pic.twitter.com/GFU2LDntY5
— OTT Trackers (@OTT_Trackers) September 30, 2025
Kuberaa | కుబేర మీ ముందుకు వచ్చేస్తున్నాడు.. ధనుష్ ఫ్యాన్స్ రెడీనా..?
Junior | మూడు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కిరీటి జూనియర్.. మూవీ లవర్స్ రియాక్షన్ ఏంటో మరి..?
Rukmini Vasanth | కాంతార హీరోయిన్ రుక్మిణి వసంత్ అడ్వెంచరస్ సర్ఫింగ్.. ఎక్కడికెళ్లిందో మరి..!