హుజురాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. శుక్రవారం రాత్రి ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామం లో బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ రోడ్ షో సందర్భంగా గ్రామంలో ఉన్న టీఆర్ఎస్ కార్యాలయం ఎదురుగా ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు చేశారు.
దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య కొంతసేపు తోపులాట సాగింది. బీజేపీ నాయకులు టీఆర్ఎస్ శ్రేణులను తోసివేశారు. ఇంతలో అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.