AP News | పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. కన్నతల్లి, తోడబుట్టిన తమ్ముడిని ఓ అన్న అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లనే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. భీమవరం పట్టణానికి చెందిన మహాలక్ష్మీ(60)కి ఇద్దరు కుమారులు శ్రీనివాస్ (37), రవితేజ (33), ఓ కుమార్తె ఉన్నారు. కుమారులు ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. కూతురు ఏమో బెంగళూరులో ఉంటుంది. ఇదిలా ఉంటే సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శ్రీనివాస్ తన తల్లి, తమ్ముడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతనే పోలీసులకు ఫోన్ చేశాడు. ‘ మా అమ్మ, తమ్ముడు కలిసి నన్ను ఇంట్లో బంధించారు. నా మనసులో ఏం మాట్లాడుకుంటున్నానో అది వాళ్లకు తెలిసిపోతుంది’ అని పోలీసుకలు శ్రీనివాస్ తెలిపాడు. అందుకే వాళ్లను కత్తితో పొడిచి చంపేశానని చెప్పాడు. రక్తపు మడుగులో వాళ్లు కొట్టుకోవడం చూస్తుంటే.. దెయ్యాలై వచ్చి కూడా నన్ను వేధించేలా ఉన్నాడని ఫోన్లో ఆందోళన వ్యక్తం చేశాడు.
శ్రీనివాస్ ఫోన్ చేసిన తర్వాత పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు చూసే సరికి మహాలక్ష్మీ, రవితేజ పేగులు కూడా బయటకు వచ్చేసి ఉన్నాయి. ఇది చూసిన పోలీసులు షాకయ్యారు. చనిపోయిన తర్వాత కూడా వారిని అలాగే పొడుస్తూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌కు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.