Ghee Coffee | మనలో చాలా మందికి ఉదయాన్నే కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే హాట్ కాఫీ తీసుకుంటే తక్షణం శక్తి సమకూరిన భావన కలుగుతుంది. అయితే కప్పు కాఫీలో ఓ చిన్న పదార్ధాన్ని జోడిస్తే అది రుచితో పాటు పోషకాల గనిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
కాఫీలో నెయ్యిని జోడిస్తే ఆ మజానే వేరని, ఆరోగ్యకర కొవ్వులతో కూడిన నెయ్యితో కాఫీలో పోషక విలువలు అమాంతం పెరుగుతాయని అంటున్నారు. గోల్డెన్ లిక్విడ్‌గా చెప్పే నెయ్యితో బోలేడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో ఈ డ్రింక్‌ను పాపులర్ చేయడంతో ఘీ కాఫీ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా వింటర్లో ఘీ కాఫీని ఆస్వాదించడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
తక్షణ శక్తి లభిస్తుంది
ఆరోగ్యకర కొవ్వులు
జీర్ణక్రియ, ప్రేవుల ఆరోగ్యానికి మేలు
శరీరాన్ని వేడిగా ఉంచుతుంది
Read More :
Crime | విద్యార్థిని చావబాది, నోట్లో మూత్రం పోసి.. అమానవీయ ఘటన