కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన జరిగింది. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన హెడ్‌కానిస్టేబుల్ సహా డజనుమంది అతడిని చావబాది ఆపై ఒకరితర్వాత ఒకరిగా అతడి నోట్లో మూత్రం పోసి తాగించారు. అంతటితో ఆగక చెప్పులపై ఉమ్మివేసి నాకించారు.
కాన్పూరులో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. ఎంసీఏ విద్యార్థి ఆయుష్ ద్వివేది (23) తన స్నేహితుడితో కలిసి ఓ స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లిన సమయంలో కొందరు దుండగులు తుపాకి గురిపెట్టి అతడిని కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.